AP: కృష్ణా (D) ఉంగుటూరు (M) పొట్టిపాడుకు చెందిన 5 ఏళ్ల చిన్నారి బొమ్మినేని లిఖిత తన నృత్య ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది. కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలతో ఇప్పటికే హైదరాబాద్ నుంచి చెన్నై వరకు 74 ప్రదర్శనలు ఇచ్చి, నంది అవార్డు, పలు పురస్కారాలు సాధించింది. గాయత్రీదేవి ఆలయంలో ఆమె చేసిన ప్రదర్శన ప్రేక్షకులను అలరించగా, ప్రస్తుతం వినాయక మండపాల వద్ద తన నృత్యాలను ప్రదర్శిస్తోంది.