AP: పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, గాలి, నీరు, నేల వంటి ప్రకృతి వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పచ్చదనం, ఇంధన పొదుపు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని, ఇంధన వనరులను పొదుపుగా వినియోగించాలని సూచించారు.