దేశంలో సరికొత్త హరిత విప్లవానికి భారతీయ రైల్వే శ్రీకారం చుట్టబోతోంది. పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో పీఎం
మోదీ జులై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్ - సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల దూరంలో ఈ రైలు నడవనుంది. ప్రస్తుతం డీజిల్ రైలుకు రెండు గంటలు పట్టే ఈ ప్రయాణాన్ని హైడ్రోజన్ రైలు గంటలోనే పూర్తి చేస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూ. 89 కోట్లతో దీనిని రూపొందించారు.