వికలాంగులకు రిజర్వు చేసిన బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

0చూసినవారు
వికలాంగులకు రిజర్వు చేసిన బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్
AP: అమరావతిలో వికలాంగులకు రిజర్వు చేసిన బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని శాఖలు ప్రత్యేక నియామక డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు పోస్టుల భర్తీకి గడువు మరో ఏడాది పొడిగించి, వచ్చే మార్చి 31 వరకు విస్తరించారు. రిజర్వేషన్‌ నిబంధనలు, నియామక మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ నిర్ణీత సమయంలో భర్తీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్