పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్

16చూసినవారు
పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్
AP: పోలవరం జిల్లాలోని పాపికొండల విహారయాత్ర శనివారం నుంచి తిరిగి ప్రారంభమైంది. గత 18 రోజులుగా నిలిచిపోయిన బోటు యాత్రలకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. రంపచోడవరం ఆర్డీవో, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బోట్లను తనిఖీ చేయగా, ఐదు శాఖల అధికారులతో కూడిన కమిటీ భద్రతా ప్రమాణాలను పరిశీలించింది. ప్రతి బోటు ఫిట్‌నెస్‌తో ఉండాలని, లైఫ్ జాకెట్లు తప్పనిసరి అని నిర్వాహకులకు స్పష్టం చేశారు. పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్