గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'పెద్ది' సినిమా, జూన్ 4న విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే 'పెద్ది'లోని 'చికిరి చికిరి' పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడమే కాకుండా.. ఇప్పుడు పెళ్లిళ్లలోనూ వినిపిస్తోంది. ఓ రిసెప్షన్‌లో పెళ్లికొడుకు
క్రికెట్ బ్యాట్ పట్టుకుని, రామ్ చరణ్‌లాగా 'చికిరి చికిరి' పాటకు స్టెప్పులు వేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.