AP: కడప జిల్లా బద్వేలులోని సిద్ధవటం రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యమ్మని శివశంకర్ (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం సెంచరీ ప్లైవుడ్ కంపెనీలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా 132 కేవీ సబ్ స్టేషన్ వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మరో 10 రోజుల్లో అతడికి పెళ్లి జరగాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. మృతడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.