దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం తొలిసారిగా రూ.2 లక్షల కోట్లు దాటింది. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, మార్చిలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,00,064 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 8.8 శాతం అధికం. దేశీయంగా స్థిరమైన ఆదాయంతోపాటు దిగుమతులపై పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ జీఎస్టీ వసూళ్లు 8.3 శాతం వృద్ధితో రూ.22.27 లక్షల కోట్లకు చేరాయి.