విజయవాడలో సెలూన్ షాపు నడిపే శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూ.70 లక్షల జీఎస్టీ నోటీసులు రావడం కలకలం రేపింది. 40 ఏళ్లుగా పంజా సెంటర్‌లో చిన్న షాపుతో జీవనం సాగిస్తున్న తనకు, విశాఖలో ఐరన్ స్క్రాప్ వ్యాపారం ఉన్నట్లు జీఎస్టీ అధికారులు రికార్డులు చూపించారని, దీనితో తన బ్యాంకు ఖాతాను నిలిపివేశారని ఆయన వాపోయారు. తనకు ఎలాంటి వ్యాపారం లేదని చెప్పినా అధికారులు స్పందించలేదని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.