
అస్కార్ స్థాయిలో యాక్ట్ చేసిన శునకం (వీడియో)
ఆహారం కోసం ఒక కుక్క చేసిన ఆస్కార్ రేంజ్ నటన నెట్టింట నవ్వులు పూయిస్తోంది. బజారులో కాళ్లు విరిగిపోయినట్లు రోడ్డుపై దేకుతూ వెళ్ళిన కుక్క, ఫుడ్ స్టాల్ వద్ద దీనంగా చూసింది. ఫుడ్ నోట్లో పడగానే చటుక్కున లేచి నాలుగు కాళ్లపై నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియో ఓయూజర్ సామాజిక మాధ్యమంలో X ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది అందరినీ ఆకర్షిస్తోంది. 'కూటి కోసం కోటి విద్యలు' అన్నట్లుగా, ఈ కుక్క 'కూటి కోసం కోటి వేషాలు' వేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.







































