ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుంటూరు కార్పొరేషన్పైనే అందరి దృష్టి నెలకొంది. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నివాసం ఉంటున్న ఈ జిల్లా పరిధిలోని గుంటూరులో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టీడీపీలో మేయర్ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే, పార్టీ అధిష్టానం పాత సక్సెస్ ఫార్ములాను అనుసరించి, రాజకీయ అనుభవం లేని కొత్త అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.