అద్దంకి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని వైయస్సార్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గోలి రమణబాబు శుక్రవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఈ ఆసుపత్రి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ భాగస్వాములు కావాలని రమణబాబు పిలుపునిచ్చారు.