అద్దంకిలోని సుందరయ్య భవనంలో గురువారం సీఐటీయూ, ఏఐటీయూసీ యూనియన్ల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మంజూదర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోర్టు బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలని ఆయన అన్నారు.