అద్దంకి: పంచాయతీలకు ట్రై సైకిల్స్ అందజేత

617చూసినవారు
అద్దంకి: పంచాయతీలకు ట్రై సైకిల్స్ అందజేత
అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 26 గ్రామ పంచాయతీలకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు, ఎంపీడీవో వరూధిని ఈ కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ కార్యదర్శులకు ట్రై సైకిళ్లను అందజేశారు. గ్రామాలలో స్వచ్ఛతను లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, క్లాప్ మిత్రలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్