సింగరకొండలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి –ఘటనపై పోలీసుల దర్యాప్తు

1098చూసినవారు
శనివారం అద్దంకి మండలం సింగరకొండలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. నరసరావుపేట నుంచి ఒంగోలు వెళ్తున్న బస్సును సింగరకొండ వద్ద కారు అడ్డంగా ఆపడంతో డ్రైవర్ హారన్ మోగించాడు. దీనికి ఆగ్రహించిన కారు యజమాని డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్