చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై చీరాలకు వచ్చిన ఆయన అధికారికంగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, చట్ట పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తానని ఆయన చెప్పారు.