కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంపు హరిబాబు పాల్గొని, పంచాయతీ సిబ్బందితో కలిసి అన్ని కాలనీలలో బ్లీచింగ్ చల్లించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. గ్రామంలో ప్రతిరోజూ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.