రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికి కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జె. పంగులూరు మండలం ముప్పవరం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటిని పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని మంత్రి సూచించారు.