శుక్రవారం కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలోని టిడిపి కార్యాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టిడిపి మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు మన్నె రామారావు పాల్గొన్నారు. ఆయన స్వామివారికి పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత సభ్యులు, కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.