అనమనమూరులో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు

665చూసినవారు
అనమనమూరులో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు
కొరిశపాడు మండలం అనుమనమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఎగురవేసి నందమూరి తారక రామారావుని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు నూతలపాటి సుబ్బారావు, పొత్తూరి లింగయ్య, షేక్ నాగూర్, రంపతోటి గోపి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల, అద్దంకి ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్