తహసిల్దార్ శ్రీ చరణ్ మాట్లాడుతూ, జనాభా లెక్కలను ప్రజలే నమోదు చేసుకునేలా ఒక ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గురువారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు జనగణనపై శిక్షణా కార్యక్రమం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరగనున్న తొలి జనగణన 2027 కోసం భారీ కసరత్తు జరుగుతోందని, ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.