బాపట్ల ఎస్పీ పి జి ఆర్ ఎస్ కు 36 అర్జీలు

897చూసినవారు
బాపట్ల ఎస్పీ పి జి ఆర్ ఎస్ కు 36 అర్జీలు
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ కలహాలు, భూవివాదాలు, ఆర్థిక లావాదేవీలు, వరకట్న వేధింపులకు సంబంధించిన 36 మంది అర్జీదారుల ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. బాధితుల సమస్యలను స్వయంగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో తక్షణమే విచారణ జరపాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్