జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ

2969చూసినవారు
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మంగళవారం, జర్నలిస్టుల పిల్లల విద్యాభ్యాసానికి ప్రోత్సాహంగా ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజుపై 50 శాతం రాయితీ కల్పిస్తూ జీవో జారీ చేశారు. ఈ జీవో కాపీని డీఈవో శ్రీనివాస్ సింగ్ కు అందజేశారు. ఈ నిర్ణయంపై బాపట్ల జిల్లా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాయితీ జూన్ 30, 2026 నుండి అమలులోకి వస్తుంది.

సంబంధిత పోస్ట్