బాపట్లలో ఆదివారం ఉపాధ్యాయురాలు తోటకూర పద్మావతి ఉద్యోగ విరమణ సందర్భంగా బావాజీపాలెం ఫంక్షన్ హాల్ లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. నిజాంపట్నం జడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరై, చందు వెంకటేశ్వరరావు - పద్మావతి దంపతులను సత్కరించి, బహుమతులు అందజేశారు. విద్యారంగానికి ఆమె చేసిన సేవలను నర్రా సుబ్బయ్య కొనియాడారు.