మేధా శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు

3554చూసినవారు
మేధా శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు
బాపట్లలో శనివారం మేధా కాలేజీ డైరెక్టర్, సమాజ్‌వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, పాత్రికేయుడు మేధా శ్రీనివాసరావుకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు, సహచరులు కలిసి పాడె మోయడం భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. విద్యారంగం, సామాజిక సేవ, రాజకీయాలు, జర్నలిజంలో ఆయన చేసిన సేవలను పలువురు గుర్తుచేసుకున్నారు.

సంబంధిత పోస్ట్