బాపట్ల పట్టణ సిఐ రాంబాబు ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం గడియార స్తంభం వద్ద ద్విచక్ర వాహనాల తనిఖీలు నిర్వహించారు. టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సుమన్, సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.