బాపట్ల జిల్లాలో పరార్.. హైదరాబాద్‌లో పట్టివేత

2953చూసినవారు
బాపట్ల జిల్లాలో పరార్.. హైదరాబాద్‌లో పట్టివేత
నగరం మండలం కట్టావ గ్రామానికి చెందిన అల్తాఫ్ ఖాన్, క్రైమ్ నంబర్ 59/2019 కేసులో నిందితుడిగా ఉన్నాడు. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నందున అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయబడింది. నగరం ఎస్ఐ భార్గవ్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని హైదరాబాదులో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 15 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్