గురుకులంలో 5 నుండి 10 తరగతులకు, ఇంటర్ గ్రూపులకు ప్రవేశాలు

2641చూసినవారు
గురుకులంలో 5 నుండి 10 తరగతులకు, ఇంటర్ గ్రూపులకు ప్రవేశాలు
బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని డాక్టర్ B.R. అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికి 5 నుండి 10వ తరగతి వరకు SC కులస్తులైన బాలురకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఇంటర్మీడియట్ MPC, BiPC గ్రూపులలో కూడా SC బాలురకు ఖాళీలు ఉన్నాయి. అన్ని తరగతులలో ఇతర కులాల వారికి కూడా పరిమిత సంఖ్యలో సీట్లు కలవు. ఆసక్తి గలవారు పని దినాలలో పాఠశాలకు వచ్చి వెంటనే సీటు పొందవచ్చు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్