మాదకద్రవ్యాలు బాల్యవివాహాలపై అవగాహన సదస్సు

1143చూసినవారు
మాదకద్రవ్యాలు బాల్యవివాహాలపై అవగాహన సదస్సు
బాపట్ల మండల న్యాయ సేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్టువర్టుపురం సచివాలయంలో బాల్యవివాహాలు, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని న్యాయవాదులు హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయవాదులు ఆంజనేయులు, కిరణ్ కుమార్, పిఎల్వి పఠాన్ మహమ్మద్ ఖాన్, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్