ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులను అధికారులు చిత్తశుద్ధితో చేపట్టాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో ఎన్ హెచ్ ఏ, ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధిలో బాపట్ల జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.