బాపట్ల: అక్రమ రేషన్ బియ్యం లారీ స్వాధీనం

3162చూసినవారు
బాపట్ల: అక్రమ రేషన్ బియ్యం లారీ స్వాధీనం
బాపట్ల సివిల్ సప్లైస్ అధికారులు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న అశోక లైలాండ్ మినీ లారీని గురువారం తెల్లవారుజామున  స్వాధీనం చేసుకున్నారు. కాకుమాను వైపు నుండి మూలపాలెం మీదుగా బాపట్ల వైపు వస్తున్న ఈ లారీని రైలుపేటలోని జమేధర్ పేట వద్ద అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులను చూసి డ్రైవర్ పరారైనట్లు సి ఎస్ డీ టి ఫణి కుమార్ తెలిపారు. ఈ లారీ పొన్నూరు పట్టణానికి చెందిన పాలపర్తి వెంకటరావు పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్