ప్రధాని మోదీని కలిసిన బాపట్ల ఎంపీ తెన్నేటి

672చూసినవారు
ప్రధాని మోదీని కలిసిన బాపట్ల ఎంపీ తెన్నేటి
లోక్ సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ మంగళవారం న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని, అదనపు నిధులు కేటాయించాలని ఎంపీ ప్రధానిని విజ్ఞప్తి చేసినట్లు బాపట్ల ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్