విద్యుత్ రంగంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు

2070చూసినవారు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ 'ఎ. పి. విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ' ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ లో వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బాబురావు మాట్లాడుతూ, విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న జేఎల్ఎం గ్రేడ్ 2 కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి వెళ్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్