బాపట్ల జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బాపట్ల సేవా సేతు’ కార్యక్రమానికి ప్రజలు, వివిధ సంఘాలు, ఉద్యోగుల నుంచి లభిస్తున్న స్పందన అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు, చీరాల, రెపల్లే, బాపట్ల ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘బాపట్ల సేవా సేతు’ వెబ్సైట్లో అన్ని వివరాలు పొందుపరిచినట్లు ఆయన వివరించారు.