ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ బుధవారం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మావతి, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.