నిజ నిర్ధరణతో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి కలెక్టర్

306చూసినవారు
నిజ నిర్ధరణతో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి కలెక్టర్
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా నిజ నిర్ధరణతో వాస్తవాలను మాత్రమే వెలుగులోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. సి రాఘవాచారి మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా విలేకరులకు పునఃశ్చరణ తరగతులు శనివారం కమ్మ కళ్యాణ మండపంలో జరిగాయి. సమాజాన్ని మేలుకొలుపు మంచి విషయాలను తెలియజేసే బాధ్యత విలేకరులపై ఉందని, శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, ఆర్డీవో గ్లోరియా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్