బాపట్లలో త్రాగునీటి వ్యవస్థపై కమిషనర్ హాసిని ఆకస్మిక తనిఖీ

3861చూసినవారు
బాపట్లలో త్రాగునీటి వ్యవస్థపై కమిషనర్ హాసిని ఆకస్మిక తనిఖీ
బాపట్ల పురపాలక సంఘ కమిషనర్ ఎం. హాసిని  బాపట్లలో త్రాగునీటి సరఫరా వ్యవస్థ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రైతు బజార్, మున్సిపల్ మార్కెట్‌లను ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. త్రాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలని, ఫిల్టర్ బెడ్లు, నీటి నిల్వ రిజర్వాయర్లను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతు బజార్, మార్కెట్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని, ప్రజారోగ్య పరిరక్షణలో నాణ్యమైన త్రాగునీరు, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్