సచివాలయ సిబ్బందిని సన్మానించిన కమిషనర్

658చూసినవారు
సచివాలయ సిబ్బందిని సన్మానించిన కమిషనర్
బాపట్ల పురపాలక సంఘ పరిధిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం 10 గంటలకే 100% పింఛన్ల పంపిణీని పూర్తి చేసిన ఇస్లాంపేట సచివాలయం ఎడ్యుకేషన్ సెక్రటరీ, జగన్నాధపురం సచివాలయం వెల్ఫేర్ సెక్రెటరీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలను కమీషనర్ రఘునాధ రెడ్డి తన కార్యాలయంలో శాలువాలతో సత్కరించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరగా చేరవేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మూకిరి చంద్ర మోహన్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్