పేదల ఇళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి సిపిఐ

935చూసినవారు
పేదల ఇళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి సిపిఐ
బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో, సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి సింగరకొండ, పేదల గృహ నిర్మాణ ఇళ్ల స్థలాల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో నివాస స్థలాలు లేక ఎంతో మంది పేద ప్రజలు రోడ్లపైనే కాలం వెళ్లదీస్తున్నారని, గతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినా క్షేత్రస్థాయిలో వారికి స్థలాలను చూపించలేదని ఆయన ఆరోపించారు. తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రంలో కోరారు.

సంబంధిత పోస్ట్