ఏరువాక పౌర్ణమి: ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

2713చూసినవారు
ఏరువాక పౌర్ణమి: ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
బాపట్ల నియోజకవర్గంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బాపట్ల పట్టణం నుండి అప్పికట్ల గ్రామం వరకు వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 'జై కిసాన్' నినాదాలతో రహదారులన్నీ మార్మోగాయి. ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్