బాపట్ల పురపాలక సంఘ పరిధిలో తాగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో మంజూరైన 'అమృత్ 2.0' పథకం పనులకు సోమవారం ఉదయం అత్యంత ఘనంగా శంకుస్థాపన జరిగింది. బాపట్ల బైపాస్ రోడ్డులోని ప్యాడ్సన్ పేట హౌసింగ్ కాలనీ (
ఎన్టీఆర్ టౌన్ షిప్) వద్ద ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు.ఈ వేడుకలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) తెన్నేటి కృష్ణ ప్రసాద్ తో కలిసి, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పట్టణ ప్రజల సుదీర్ఘ తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ కార్యక్రమం చేపట్టారు.