ఇంకొల్లులోని మరలకుంటలో, ఎలాంటి రెవెన్యూ పంచాయతీ అనుమతులు లేకుండా, వివాదంలో ఉన్న గ్రామానికి సంబంధించిన పుర మందిరం స్థలంలో శనివారం మట్టి తరలింపు చేపట్టారు. జెసిపితో ట్రాక్టర్ల ద్వారా ఈ అక్రమ మట్టి తరలింపు జరుగుతోందని రైతులు స్థానిక ఎమ్మార్వో ఏవీఎస్ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. తమ వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వారు తెలిపారు. ఎమ్మార్వో సంబంధిత విఆర్ఓను అక్రమ మట్టి తరలింపు స్థలానికి పంపించి, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తప్పవని, రాత్రిపూట తరలిస్తే నేరమని హెచ్చరించారు.