చెరుకుపల్లిలో శిరోరక్ష -ప్రాణరక్ష అవగాహన కార్యక్రమం

1363చూసినవారు
చెరుకుపల్లిలో శిరోరక్ష -ప్రాణరక్ష అవగాహన కార్యక్రమం
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, శనివారం రాత్రి చెరుకుపల్లి ఖాదర్ ఖాన్ సెంటర్ వద్ద చెరుకుపల్లి ఎస్సై కందుల కృష్ణ తిరుపతిరావు మరియు సిబ్బంది 'శిరోరక్ష-ప్రాణరక్ష' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు. నేషనల్ హైవేపై మోటార్ సైకిల్ నడిపే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్