కొల్లూరు బాలికల పాఠశాల విద్యార్థినులకు ఐఐఐటీ ప్రవేశాలు

942చూసినవారు
కొల్లూరు బాలికల పాఠశాల విద్యార్థినులకు ఐఐఐటీ ప్రవేశాలు
బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు గ్రామంలోని శ్రీమతి తల్లపనేని జయలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు నలుగురు ఐఐఐటీ ప్రవేశ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి, నూజివీడు, ఒంగోలు కళాశాలల్లో ప్రవేశం పొందారు. కుమారి బావిరెడ్డి దివ్య తేజశ్రీ, తాడేపల్లి సిరి నూజివీడు కళాశాలలోనూ, కుమారి కలపల సౌజన్య శ్రీ, ఎస్. భార్గవి ఒంగోలు కళాశాలలో అడ్మిషన్ పొందారు. ఈ సందర్భంగా, పాఠశాల పూర్వపు ఉపాధ్యాయురాలు శ్రీమతి చావా ఉషా కుమారి విద్యార్థినులను అభినందించి, ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు.

సంబంధిత పోస్ట్