జగన్ పై అసభ్య వ్యాఖ్యలు: ఎమ్మెల్యేపై ఫిర్యాదుకు వైఎస్ఆర్సీపీ సిద్ధం

2465చూసినవారు
జగన్ పై అసభ్య వ్యాఖ్యలు: ఎమ్మెల్యేపై ఫిర్యాదుకు వైఎస్ఆర్సీపీ సిద్ధం
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అసభ్య, అవమానకర, విద్వేషపూరిత వ్యాఖ్యలపై రేపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. రేపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు ఈ ఫిర్యాదు అందజేయబడుతుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ స్థాయిల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్