ఆదివారం బాపట్ల
జనసేన పార్టీ కార్యాలయం నుండి అందిన సమాచారం ప్రకారం, ఉప ముఖ్యమంత్రి మరియు
జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్, బాపట్ల పార్లమెంట్ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కోసం ఏర్పాటు చేసిన 7 మంది సభ్యుల కమిటీకి నియామక పత్రాలను అందజేశారు. ఈ కమిటీలో బాపట్ల నియోజకవర్గం నుండి సీనియర్ సభ్యులు పడమటి ధర్మారావు, ఆరుమళ్ళ సుజిత్, జిడుగు విజయ మాధురి, అలాగే పార్లమెంట్ అబ్జర్వర్ టీం సభ్యులు ఆకిశెట్టి నాగమల్లేశ్వరి, కారుమూరి ఆంజనేష్, గోపాలం లక్ష్మీ, ఒంగోలు రాఘవేంద్ర రావు ఉన్నారు. ఈ నియామకం పార్టీ కార్యాలయంలో జరిగింది.