జూన్ 15న ఒంగోలు ఐటీఐలో ఉద్యోగ మేళా

559చూసినవారు
జూన్ 15న ఒంగోలు ఐటీఐలో ఉద్యోగ మేళా
ఐటీఐ విద్య పూర్తి చేసిన లేదా ప్రస్తుతం శిక్షణ పొందుతున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 15న ఒంగోలులో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ప్రసాద్‌బాబు తెలిపారు. గుంటూరు రోడ్డులోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరగనుంది. హైదరాబాద్, శ్రీ సిటీ, గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లకు చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్