ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖాజా

720చూసినవారు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖాజా
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ ఖాజా నియామకమయ్యారు. శనివారం గుంటూరులోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ ఖాజాకు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ, పార్టీ తన పట్ల విశ్వాసంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, అన్ని వర్గాల ప్రజల వద్దకు పార్టీని తీసుకెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, జిల్లాలో పార్టీని పటిష్ట పరిచేందుకు ముందుకు వెళతామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్