బాపట్ల శివారులోని సూర్యలంక రహదారిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొందరు గుర్తు తెలియని ఆకతాయిల నిర్వాకం వల్ల జరిగిన ఈ ప్రమాదం స్థానిక ప్రజలను, వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిధిలోని 'ఎయిర్ ఫోర్స్ చప్టా' వద్ద ఉన్న ముళ్ల కంచెకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా నిప్పు పెట్టారు. పక్కనే పొదలు, చెత్తాచెదారం ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి కంచె భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల తీవ్రతకు అక్కడ ఉన్న 11 కేవీ (11 KV) హైటెన్షన్ విద్యుత్ సరఫరా వైర్లు, స్తంభాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.