తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ నెల 29 ఆదివారం నాడు బాపట్ల నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పార్టీ శ్రేణులను ఆదేశించారు. మండల పార్టీ అధ్యక్షులు ప్రతి గ్రామంలో కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. బాపట్ల నియోజకవర్గంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు అందరూ తప్పనిసరిగా పసుపు చొక్కాలు ధరించి, బాపట్లలోని తెదేపా కార్యాలయంలో జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.